Tuesday, 21 May 2013

డిమాండు-సప్లయ్

ఇది ఒక సప్లై ఆన్ డిమాండ్ లాగా మారిపోయింది మరి.  


ఓటు వెయ్యాలంటే బీరు, బిరియానీ కావాలి జనానికి. అది ఒక రకంగా రాజకీయ నాయకుల తప్పు. అలా ప్రజలను సంతృప్తి పరుస్తారు (టెంపరవరీగా లెండి). ప్రజలకు రాజకీయ నాయకులు దోచుకునే డబ్బు గురించి, ఎంత దోచుకుంటున్నారనే విషయాలు ఏం తెలుసు....!!!! పాపం పూర్ గయ్స్.

స్విస్సు బ్యాంకు అంటే ఎంత మందికి తెలుసు....? అందులో రాజకీయ నాయకులు డబ్బులు పోగుచేసి కొండలు కడుతున్నారని ఎంత మందికి తెలుసు....? ఈ విధంగా (వారి వారి అభిమాన) రాజకీయ నాయకులు డబ్బు దండుకోవడం వలన తమకెంత నష్టం కలుగుతుందో తెలుసుకునే పరిస్థితుల్లో ప్ర....జ....లు ఉన్నారా....? 

ఈ నాటి పరిస్థితి ఎలా ఉందంటే ఓట్లు వేసేప్పుడు (వేసే ముందైనా వేసిన తర్వాతైనా) చేతిలో క్వార్టర్ బాటిల్ ఉండాలి, తీరా నాయకులు గెలిచాక పథకాలు కూడా సరిగ్గా అమలు జరగాలి. కానీ రాజకీయ నాయకులు ఓటుకింత వెలకట్టి అప్పటికప్పుడు పరిహారం చెల్లించేస్తున్నారన్న నిజాన్ని మరిచిపోయేంతగా ప్రజలు మారిపోయారు. వారికి కావలసింది దీర్ఘకాలిక అవసరాలు కాదు (దురదృష్టవశాత్తూ అవంటే ఎంతో వారికి తెలీదు). ప్రస్తుత అవసరం తీరితే చాలు (ఓటుకు వెయ్యో లేక సీసానో చేతిలో పడిందా లేదా) తర్వాత చూసుకుందాం లే అని అనుకునేంతగా ఉన్నారు. సో కాల్డ్ "రాజకీయ" నాయక్ లకు కావలసింది కూడా ఇదే కదా. వాళ్ళూ ఫుల్ హ్యాపీ వీళ్లూ ఫుల్ హ్యాపీ. అప్పటికి.

కానీ తేడా ఏంటంటే రాజకీయ నాయకులు గెలిస్తే పెట్టిందానికి పదింతలు, వందరెట్లు, వెయ్యిరెట్లు, లక్షరెట్లు కూడా దండుకుంటారు. ప్రజలకు హామీలు మిగులుతాయి. అన్నీ గాల్లో మేడలే.

దీన్ని యువత మార్చగలదు. అనుభవం ప్రధానమైనదే కానీ అంతకుమించి అవగాహన ముఖ్యమైనది. ఒక ఇబ్బంది గురించి తెలిస్తే దాన్ని పరిష్కరించడానికి అనుభవం అవసరమైనా అంతకుమించి సమర్థత, సమయానుకూల ప్రవర్తన పని చెయ్యగలవు.

యువత రాజకీయాలలోకి రావాలి. అది మాత్రమే నేటి రాజకీయ, సామాజిక అనిశ్చితులకు పరిష్కారం.

ఇది కూడా డిమాండు-సప్లయ్యే మరి.... కాదా....!!!!

Society is in demand of new era leaders. Young and Energetic.

స్టూడియో-ఎన్ న్యూస్ చానల్ లో చేరిన కొత్తల్లో (2009) రాసినది....

No comments:
Write comments