Monday 22 February 2016

ఫెమినిజం.... నిజమా.... అబద్ధమా....



పితృస్వామ్యమంటే కుటుంబ యాజమాన్యమా లేక బాధ్యత వహించడమా? కుటుంబానికి యజమాని ఉంటాడా? లేక బాధ్యుడు ఉంటాడా? కుటుంబం సంతోషంగా ఉండాలంటే మాతృస్వామ్యమే ఉండాలా? పితృస్వామ్య వ్యవస్థ ఎందుకు పనికిరాదు? నిజమో కాదో తెలియని పౌరాణిక పాత్రలనుబట్టి మొత్తం పురుష సమాజాన్ని తిడతారా? శారీరికంగా స్త్రీని సున్నితంగా, పురుషుడిని దృఢంగా పుట్టించడం కూడా ప్రకృతి తప్పేనా? హేతువాదం ప్రకారం పుట్టుకలో సైన్సు ఉంటే, అయినా కూడా స్త్రీ పురుషుల సామాన్య లక్షణాలు మారవు కదా? కొంతమంది ఫెమినిస్టులనబడే వాళ్ళు చెప్పే మాటలు కొంచెం తేడాగా అనిపిస్తాయి.... ఈ ప్రపంచంలో ఎవరినీ ఎవరితోనూ పోల్చలేము. స్త్రీపురుషులు ఇద్దరూ ఒక్కటే అంటే ఎలా నమ్మాలో తెలియటం లేదు. శారీరకంగా, మానసికంగా, బుద్ధి పరంగా ఆడవారికి మగవారికీ లెక్కలేనన్ని తేడాలున్నాయి, అవన్నీ కూడా పురుషులమూలంగానే అని కూడా అనగలరు ఈ ఫెమినిస్టులు. ఏం జరిగినా పురుషులవల్లనే అంటే ఎలా.... అణిచివేయబడ్డారు అని చెప్పడం వేరు, అస్థిత్వం కోసం పోరాడలేకపోయారు అని చెప్పడం వేరు, ఒకవేళ అణిచివేయబడి, సేవికగా మార్చబడి ఉంటే ఆ ఎరుక వారికి లేదా? ఉంటే ఎందుకు ప్రతిఘటించలేదు? పురాణాలలోనుంచీ ఉదాహరణలు తీస్తారే, ఇన్ని లక్షల యేళ్లనుంచీ కూడా మాతృస్వామ్యాన్ని సాధించుకోలేకపోయారా? ఏదీ స్త్రీ శక్తి? పాతివ్రత్యం మగవాడి క్రూరత్వం నుంచీ తట్టుకోవడం వల్ల వచ్చిన లక్షణమా? లక్షలు గుమ్మరిస్తేగానీ విద్యావంతుడైన, యోగ్యుడైన భర్త దొరకడా? పూవుల్లో పెట్టుకుని చూసుకునేంతగా ప్రేమించేవాడు దొరికితే డబ్బు, అందాన్ని చూడకుండా పెళ్లి చేసుకునే ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో చూపించండి. Individuality అంటే తెలిసిన నేటి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో చూపించండి. పైగా ఎక్కువ తక్కువలు చూసేదీ ఎక్కువగా ఆడవాళ్లే. ఒక్క ఆడవాళ్ళనే అనడం లేదు. మగవాళ్ళలోనూ ఆడవాళ్లలోనూ అన్నీ రకాలవాళ్లూ ఉన్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి, మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి. ఈ భావన ఇద్దరిలోనూ ఉండాలి. ఆడవాళ్ళు ఎదగడానికి అవకాశాలు ఎప్పుడూ ఉన్నాయి. వారిలో లేనిదల్లా అలా ఉద్యమించవచ్చు అనే. తన సొంత అస్తిత్వాన్ని బయల్పరిచే విధానం తెలియకపోవడం వల్లనే స్త్రీలు తక్కువగా చూడబడుతున్నారు. మగవాళ్ళని అందరినీ ఒకే గాటన కట్టేసి అందరూ దుర్మార్గులే అని తిట్టినంత మాత్రాన స్త్రీలు గొప్పవారైపోరు. ఇంతమంది ఫెమినిస్టులుండి కూడా స్త్రీలు ఈ స్థితిలో ఉన్నారంటే ఫెమినిజం నిజమా కాదా.... అసలుందా లేదా....

No comments:
Write comments